డిసెంబరులో వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయి. ఏం పేరు పెట్టాలో చెప్పాలని సీఎం రేవంత్ పోస్టుపై సందీప్ రెడ్డి వంగా స్పందించి రెండు పేర్లు సూచించారు. ‘నా సొంతూరు వరంగల్ కు ఎయిర్ పోర్ట్ కల సాకారం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. నేను రెండు పేర్లు సూచించాలనుకుంటున్నా. రుద్రమ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (RIA), కాకతీయ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (KIA). వీటిలో ఏది పెట్టినా వరంగల్ ఘనమైన వారసత్వ, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని నమ్ముతున్నా’ అన్నారు.