ఆంధ్రప్రదేశ్ క్రీడా రంగంలో నూతన ఉత్సాహాన్ని నింపుతూ Women AP Premier League – WAPL సీజన్-1 టోర్నమెంట్ అధికారికంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని అత్యాధునిక స్టేడియంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుక క్రీడా ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వేడుకలో పాల్గొన్న నారా బ్రాహ్మణి స్వయంగా WAPL ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ టోర్నమెంట్లో భాగంగా ఉమెన్ ఆంధ్ర ప్రిమియర్ లీగ్ సీజన్-1 తొలి మ్యాచ్లో అమరావతి ఈగల్ ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్బర్డ్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.