జనసేన రాజకీయంపై ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం జనసేన పార్టీ సంస్థాగతంగా కొంత బలహీనంగా ఉండవచ్చని, అయితే అధినేత పవన్ కల్యాణ్ ఆదేశాలను కార్యకర్తలంతా క్రమశిక్షణతో పాటిస్తే పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందన్నారు.కచ్చితంగా గెలిచే సీట్లలోనే పోటీ చేద్దాం.. ఎక్కువ సీట్లలో పోటీ చేయాలని ఆశ పడవద్దని,తొందర పడి 100 ఇవ్వండి, 120 సీట్లు ఇవ్వండని మాత్రం అడగటం లాంటివి చేయవద్దన్నారు.