ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేరళలో చికిత్స ముగించుకుని ఏపీకి చేరుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ వినాశ్రయంలో ఆయనకు నాయకులు, అధికారులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కల్యాణ్ అక్కడి నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.