గచ్చిబౌలి డివిజన్ గోపనపల్లి ఎన్టీఆర్ నగర్లో ప్రమాదకరంగా ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేతను అధికారులు చేపట్టారు. వంగిన భవనాన్ని నేలమట్టం చేసేందుకు ఎన్టీఆర్ నగర్ కు బాహుబలి క్రేన్ ను తెప్పించారు. భవనం చుట్టుపక్కల ప్రజలను ఖాళీ చేయించి.. కూల్చివేతను ప్రారంభించారు. అనుమతులు లేకుండా ఈ భవనాన్ని అక్రమంగా నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. శుక్రవారం ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో స్థానికులు భయాందోళనకు గురైన విషయం తెలిసిందే.