మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలానికి చెందిన మెట్టుగడ్డ తండా వాసులు తమ స్వగ్రామంలో జరిగిన వినాయక నిమజ్జనం ఉత్సవాల్లో ఆనందంగా పాల్గొన్నారు. తిరిగి శంషాబాద్ వైపు ఇన్నోవాలో వెళ్తోండగా పాలమాకుల సమీపంలో కారు అదుపు తప్పింది. బోల్తా కొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం మొత్తం పూర్తిగా నుజ్జు నుజ్జు అయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు.. ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.