సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ పరిసరాల్లోని భూములపై రెండోరోజూ అధికారులు సర్వే కొనసాగుతోంది. ప్రభుత్వ భూముల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల భూములపై ఆరా తీశారు. ఆ సర్వేనంబర్ లో ఎన్ని ఎకరాల ప్రభుత్వ భూమి ఉందో శాటిలైట్ సర్వే చేస్తున్నారు. సర్వేనంబర్లు, గతంలో ఉన్న రైతుల పేర్ల వివరాలను సైతం సేకరిస్తున్నారు. ఈ వివరాలను మర్కూక్ రెవెన్యూ అధికారులు నివేదిక రూపంలో సిద్ధం చేస్తున్నారు.ఎర్రవల్లి, వెంకటాపూర్, వరదరాజ్‌పూర్ సరిహద్దులోని భూములను సర్వే చేస్తున్నారు.