బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కింగ్’ (King) చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్పాట్ ఫొటోలు నెట్టింట లీకై సంచలనం సృష్టిస్తున్నాయి. సుజయ్ ఘోష్ దర్శకత్వంలో, సిద్ధార్థ్ ఆనంద్ పర్యవేక్షణలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగానే ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్‌కు సంబంధించిన స్టిల్స్ లీక్ కావడం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.