మణిపూర్‌లోని సహాయ శిబిరాల్లో తలదాచుకున్న ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం కలకలం రేపింది. దీనిపై నివేదిక ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే చాలా తక్కువగా పరిహారం ఇవ్వడాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. మణిపూర్‌లో 2023లో జరిగిన జాతి హింసాకాండలో వందలాది మంది మరణించగా వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సహాయ శిబిరాల్లో వారు తలదాచుకున్నారు. అయితే సహాయక శిబిరాల్లో నివసించే ప్రజలు అసాధారణంగా చనిపోతున్నారు. తాజాగా 25 మంది మరణించడం ఆందోళన రేపింది. ఇది సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది.