మద్యం రవాణా టెండర్ల కేసులో నిందితుడిగా ఉన్న వైకాపా నేత, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును సిట్ అధికారులు కస్టడీకి తీసుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో ఉన్న ఆయన్ను ఏపీ సిట్ అధికారులు కస్టడీకి తీసుకొని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నారు. పీటీ వారెంట్ పై కారుమూరిని చంచల్ గూడ నుంచి విజయవాడ జైలుకు తరలించారు. ఇప్పటికే కారుమూరిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు.