ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఐదో సీజన్‌కు సంబంధించిన అధికారిక తేదీలను భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 14 నుండి ఫిబ్రవరి 7 వరకు ఈ సీజన్ మ్యాచ్‌లు జరగనున్నట్లు బీసీసీఐ జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా తెలిపారు. కొత్త సీజన్ కోసం ప్లేయర్లను రిటెన్షన్ చేసుకునే ప్రక్రియకు సంబంధించి ఈ నెల 28 వరకు ఐదు ఫ్రాంచైజీలకు గడువు విధించారు. అనంతరం అక్టోబర్ 28న కొచ్చి వేదికగా ఆటగాళ్ల వేలం పాట నిర్వహించనున్నారు.