ప్రధాని నరేంద్ర మోదీతో పాఠశాలలో కలిసి చదువుకున్న 81 ఏళ్ల అస్గర్ అలీ వోరా.. మహారాష్ట్రలోని భయందర్ లో తన భూమి వివాదంపై సెప్టెంబర్ 8న మోదీని కలిశారు. ఇది జరిగిన.. వారం రోజుల్లోనే వివాదాస్పద స్థలంపై బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా వెనక్కి తగ్గారు. భూమిపై తనకున్న స్వాధీనాన్ని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతోపాటు, అక్కడ నిర్మాణానికి తీసుకున్న అనుమతులను కూడా సరెండర్ చేశారు. వోరాపై గతంలో ఇచ్చిన పోలీస్ ఫిర్యాదును సైతం ఉపసంహరించుకున్నారు.