ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తాజాగా వెలువడిన ఈ ఎన్నికల నోటిఫికేషన్ పరిధిలోకి రాష్ట్రంలోని ముఖ్యమైన 12 మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు, 29 మున్సిపాలిటీలు మరియు నగర్ పంచాయతీలు వస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 1వ తేదీని అర్హత తేదీగాఎస్ఈసీ నిర్ణయించింది. ఈ తేదీ నాటికి ఓటు హక్కు లభించిన వారి పేర్లతో జాబితాలను రూపొందించి, ఈ నెల 22వ తేదీన తుది ఓటర్ల జాబితాను అధికారికంగా ప్రచురించనున్నట్లు వెల్లడించింది.