యెమన్లోని వ్యూహాత్మక ప్రాంతాలు ఇప్పటికే హుతీ తిరుగుబాటుదారుల వశం కావడంతో గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియా తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయింది. ఎర్ర సముద్ర తీరంతో పాటు అత్యంత కీలకమైన బాబ్ ఎల్-మండేబ్ జలసంధిని హుతీలు స్వాధీనం చేసుకోవడం సౌదీ చమురు ఎగుమతులకు పెద్ద అడ్డంకిగా మారింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో, తమకు దౌత్య సంబంధాలు లేని ఇజ్రాయెల్ నుంచి గూఢచార సమాచారాన్ని పొందేందుకు సౌదీ అరేబియా ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.