హైటెక్ సిటీ పరిధిలోని మాదాపూర్‌లో ఓ కో-లివింగ్ హాస్టల్‌లో ఉంటున్న 23 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగి భవనం నుంచి కిందకు దూకి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. మృతుడిని శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన యశ్వంత్‌గా పోలీసులు గుర్తించారు. ఉదయం యశ్వంత్ తన ఆరోగ్యం బాగోలేదని తోటి వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అనంతరం బ్లడ్ చెకప్ చేయించుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే హాస్టల్ భవనం నుంచి కిందకు దూకినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.