నానక్ రామ్ గూడ లోని స్థల వివాదంలో సినీ నటుడు అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆయనతో పాటు మురళీధర్ రెడ్డి, గడ్డం రవిలపై ఓనర్స్ అసోసియేషన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మంత్ర కాస్మోస్ ప్రాంగణంలోకి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన అనుచరులు అక్రమంగా ప్రవేశించి, గేటు తాళాలు పగులగొట్టి రేకుల టిన్ షీట్లు ఏర్పాటు చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అక్కడి నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, సెక్యూరిటీ సిబ్బందిని బెదిరించారని,తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారని ఆరోపించారు.