గురుగ్రామ్‌లో బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ రైడర్‌ను.. కారుతో ఓ వ్యక్తి ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఆ కేసులో నిందితుడు, కారు డ్రైవర్ కళ్యాణ్ బైన్సాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని దౌసాలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు నిందిత డ్రైవర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.కారులో ఉన్న వ్యక్తి తనను వెంబడించాడని, చేతులతో బెదిరింపు సంకేతాలు చేశాడని, పారిపోవడానికి ముందు కారుతో టూవీలర్‌ను ఢీకొట్టినట్లు బాధితురాలు సియా తెలిపింది.