అంబర్‌పేట శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేశారు. జూబ్లీహిల్స్, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలలో బెదిరింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడంతో రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు సమాచారం. 2019లో అంబర్ పేట శంకర్‌పై రౌడీషీట్ ను తొలగించారు. తాజాగా రెండు పిఎస్‌లలో కేసుల నమోదుతో శంకర్‌పై మళ్లీ రౌడీషీట్ ఓపెన్ చేసినట్టు సమాచారం. జూన్ నెలలో గాజులరామారం ప్రాంతంలో బిల్డర్ కు తెలియకుండా ప్లాట్లు అమ్మడంతో శంకర్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.