లైంగిక దాడి కేసులో ‘తెహల్కా’ మ్యాగజైన్ మాజీ ఎడిటర్-ఇన్- చీఫ్ తరుణ్ తేజ్పాల్ గోవా కోర్టులో లొంగిపోయారు. అనంతరం ఆయనను ఉత్తర గోవాలోని సెంట్రల్ జైలుకు తరలించారు. తరుణ్ తేజ్పాల్కు బాంబే హైకోర్టు విధించిన పదేళ్ల కఠిన కారాగార శిక్ష అమలు కోసం 3వారాల్లోగా లొంగిపోవాలని ఆగస్టు 25న సుప్రీంకోర్టు ఆదేశించింది. లొంగుబాటు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న తేజ్పాల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది.

