ఈరోజు వినాయకచవితి సందర్భంగా తరుణ్ భాస్కర్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో ఆయన పక్కన హీరోయిన్ ఈషా రెబ్బా ఉండడం విశేషం. ఇంట్లో వినాయకుడికి పూజ చేసిన అనంతరం ఈ ఫొటో తీసుకున్నారు. తమ రిలేషన్ షిప్ గురించి ఇలా హింట్ ఇస్తున్నారని ఫ్యాన్స్ భావిస్తూ, అప్పుటే శుభాకాంక్షలు తెలుపుతున్నారు. త్వరలోనే వీళ్లు పెళ్లి చేసుకోనున్నారని కామెంట్ సెక్షన్ లో రాస్తున్నారు.