ప్రధాని మోదీని ఆయన క్లాస్మేట్ కలుసుకున్నారు. బిల్డర్ సంస్థలు తన భూమిని ఆక్రమించినట్లు ఆయన ఆరోపించారు. చాలా కాలంగా వివాదం కొనసాగుతున్న ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు ఒక లేఖను మోదీకి అందజేశారు. 1989లో భయందర్ ఈస్ట్‌లో 2,810 చదరపు మీటర్ల భూమిని తాను రిజిస్టర్డ్ ఒప్పందం ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేసినట్లు వోహ్రా తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాకు అనుబంధంగా ఉన్న బిల్డర్లు నకిలీ పత్రాలతో తన ఆస్తిని స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.