ఇండోనేషియాలోని జావా సముద్రంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతైంది. నౌకలో 240 మందికి పైగా ఉండటంతో తీవ్ర ఆందోళన నెలకొంది. సురబయ నుంచి బంజర్‌మసిన్‌కు వెళ్తుండగా నౌకతో రాడార్, రేడియో సంబంధాలు ఒక్కసారిగా తెగిపోయాయి. చివరిసారిగా బంజర్‌మసిన్‌లోని ఓ రేవుకు సుమారు 92 మైళ్ల దూరంలో జావా సముద్ర జలాల్లో నౌక ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ అలల తాకిడికి నౌక ప్రమాదానికి గురై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.