బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని, దీనివల్ల రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తెలంగాణలోనూ రుతుపవనాల జోరు పెరిగింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.