హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్, పోలీస్ శాఖలు నిరంతరం పర్యవేక్షించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసనమండలి కాన్ఫరెన్స్ హాల్‌లో గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల పర్యవేక్షణ, సమన్వయానికి ప్రత్యేక అధికారులను నియమించాలని సూచించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకు గణేశ్ మండపాల నిర్వాహకులు కూడా పోలీస్, అధికారులకు సహకరించాలని కోరారు.