శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని కోరుతూ టీటీడీ పాలకవర్గం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించింది. ఈ సందర్భంగా టీటీడీ వేద పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చేపడుతున్న ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలు తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వేద పండితులు, అర్చకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.