బొల్లారం మద్రాస్ రెజిమెంట్ నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు చోరీకి గురైన కేసులో నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన మాజీ ఆర్మీ ఉద్యోగి మల్లేష్‌ను ప్రధాన నిందితుడిగా గుర్తించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు మల్లేష్ సోషల్ మీడియా ఖాతాలను దర్యాప్తు సంస్థలు పరిశీలిస్తున్నాయి. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతానికి చెందిన ఆయుధాలు,
మందుగుండు సామగ్రి విక్రేతకు సంబంధించిన ఇన్స్టాగ్రామ్ ఖాతాను మల్లేష్ ఫాలో అవుతున్నట్లు అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆ ఖాతాలో షాట్‌గన్స్, AK-47 తదితర తుపాకులకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది