బిగ్ బాస్ హౌస్‌లో ఆటో రామ్ ప్రసాద్ ప్రవర్తన రోజురోజుకూ హద్దులు దాటిపోతోంది. ‘పెద్ది’ సినిమాలోని “వారానికి వెయ్యి” అనే పాటను కంటెస్టెంట్ షాలిని సరదాగా పాడుకుంటుంటే.. మధ్యలో దూరిన రామ్ ప్రసాద్ “వారానికి వెయ్యినా? నీకు అదే ఎక్కువ!” అంటూ అత్యంత అసభ్యకరమైన టోన్‌లో వ్యాఖ్యానించడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒక ఆడపిల్ల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం వేరు అనే కనీస విచక్షణ కూడా మరిచిపోయి ప్రవర్తిస్తున్న తీరు మహిళలపై ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడే వ్యక్తి ప్రవర్తనను నెటిజన్లు తీవ్రంగా చీదరించుకుంటున్నారు.