ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌కు కొడుకు ఉన్నాడో లేడో తెలుసుకోవడానికి దక్షిణ కొరియా జాతీయ నిఘా సంస్థ (NIS) ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఒకవేళ కొడుకు ఉన్నప్పటికీ, ఆయన తండ్రికి వారసుడు అయ్యే స్థితిలో లేడని NIS స్పష్టం చేసింది. కిమ్ 13 ఏళ్ల కుమార్తె కిమ్-జు-యే ఆయన రాజకీయ వారసురాలిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని దక్షిణ కొరియా పునరుద్ఘాటించింది. కిమ్ జోంగ్ ఉన్‌కు మూడో సంతానం కూడా ఉందన్న సమాచారం ఉన్నప్పటికీ ఇంకా నిర్ధారణ కాలేదు.