ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేసారు. స్వర్ణ, గ్రామ, స్వర్ణ వార్డు సిబ్బందికి ప్రస్తుత అవసరాలను బేరీజు వేసుకుని జాబ్ ఛార్ట్ సిద్దం చేయాలని ఆదేశించారు. స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాలకు ఓ ఈవీ సైకిల్ ఇవ్వాలని నిర్దేశించారు. స్వర్ణవార్డు, గ్రామ కార్యాలయాల్లో కొంత మందికి ఎక్కువ పని ఉంటోంది… కొంత మందికి చాలా తక్కువ పని ఉంటోందని… దీన్ని సరి చేసి రేషనలైజ్ చేయాలని ఆదేశించారు. కాగా, పని భారం పెంచకుండా… వివిధ బాధ్యతలను అప్పచెప్పేలా చూడాలని ఆదేశించారు.