2025 మెగా డిఎస్సి కాదు.. దగా డిఎస్సి అని మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ఎవరైనా ఆధారాలు చూపిస్తే..కేసులు పెడుతున్నారని అన్నారు.ఎపి సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ అసెంబ్లీలో అబద్ధాలు చెబుతున్నారని, మెగా డిఎస్సిలో తవ్వేకొద్దీ అక్రమాలు కనిపిస్తున్నాయని విమర్శించారు. డిఎస్సి స్కామ్ ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారని, వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారని ధ్వజమెత్తారు. కొడుకును కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారని జగన్ దుయ్యబట్టారు.