పోలాండ్ రాజధాని వార్సాలో రచ్చ జరిగింది. ఏకంగా 30 రోబోలు రోడ్డెక్కి నిరసన చేపట్టాయి. “మా వల్ల మనుషుల ఉద్యోగాలు ఊడిపోతున్నాయి, AIని కంట్రోల్ చేయండి” అంటూ డిజిటల్ మంత్రిత్వశాఖ ముందు బైఠాయించాయి. జెండాలు పట్టుకుని, రౌండ్లు వేస్తూ లౌడ్‌స్పీకర్లతో నానా హంగామా చేశాయి. “జాబ్స్ కాపాడండి”, “రూల్స్ తీసుకురండి” అంటూ గొంతు చించుకున్నాయి. ‘డెమోక్రాటిజం’ అనే ఆర్గనైజేషన్ ఈ నిరసన ప్లాన్ చేసింది. ఆలోచించే AI సిస్టమ్స్ కూడా మనుషుల ఉద్యోగాలను ఎలా పీకేస్తాయో కళ్లకు కట్టినట్టు చూపించడమే వీళ్ల మెయిన్ ఉద్దేశం