loader

తెలంగాణ శాసనసభలో స్పీకర్‌ను దూషించిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో స్పీకర్‌పై మాటల దాడికి పాల్పడటం ఎంతమాత్రం సరికాదని, ఇది పార్లమెంట్, ముంబయి, పుల్వామా దాడులతో సమానమైన తీవ్రమైన నేరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యలపై సభలో చర్చ జరిగితే తమ గత పాలనలోని లొసుగులు, బండారం బయటపడుతుందనే భయంతోనే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉండి కుట్రలకు తెరతీశారని సీఎం రేవంత్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ సభ్యులను సభకు ఉసిగొల్పి కావాలనే గందరగోళం సృష్టించేలా వ్యూహం పన్నారని ఆయన ధ్వజమెత్తారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON