కేసీఆర్ ఇంటి దగ్గర చావు డప్పు కొడుతామని, తాము ఆయన చావును కోరుకుంటున్నామని నోటి దురుసు ప్రదర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.. తాజా విచిత్రమైన వివరణ ఇచ్చారు. తాను ఫ్లోలో అలా మాట్లాడానని, తాము కేసీఆర్ చావును కోరుకోవడం లేదని మాటమార్చారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తాము ఆయనను గౌరవిస్తామని అన్నారు. కానీ అంతమాట మాట్లాడినందుకు కనీసం క్షమాపణ కూడా కోరలేదు.