సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ తన మొట్టమొదటి దర్శకత్వ ప్రాజెక్ట్ అయిన ‘సిగ్మా’ సేలం ఈవెంట్లో భారీగా తరలివచ్చిన విజయ్ అభిమానులు ఒక్కసారిగా ‘టీవీకే.. టీవీకే’ అంటూ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. తన తండ్రి విజయ్ స్థాపించిన రాజకీయ పార్టీ పేరుతో అభిమానులు జోరుగా కేకలు వేస్తుండగా, వేదికపై ఉన్న జేసన్ సంజయ్ ఏమాత్రం తికమక పడకుండా ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో స్పందించారు. అభిమానులను చూస్తూ థంబ్స్ అప్ చూపించి అభివాదం చేయడంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది.