తమ ముడిచమురు ట్యాంకర్లపై అమెరికా సైన్యం జరిపిన దాడులకు ప్రతీకారంగా, జోర్డాన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ పెద్ద సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. జోర్డాన్‌లోని అల్-అజ్రాక్ (Al-Azraq) స్థావరంలో ఎఫ్-35, ఎఫ్-16, ఎఫ్-15 ఫైటర్ జెట్ విమానాల హ్యాంగర్లు, షెల్టర్లను ఘన, ద్రవ ఇంధన బాలిస్టిక్ క్షిపణులతో ఛిన్నాభిన్నం చేశామని, అమెరికా దళాలకు భారీ నష్టం వాటిల్లిందని ఐఆర్‌జీసీ పేర్కొంది.