‘ఫౌజీ’ షూటింగ్ సమయంలో ఓ కీటకం కుట్టి అనారోగ్యానికి గురైనట్లు వార్తల్లో నిజం లేదని తాజాగా రాజేష్ శర్మ స్వయంగా క్లారిటీ ఇచ్చారు తన అనారోగ్యానికి అసలు కారణం విషపురుగు కాటు కాదని రాజేష్ శర్మ వెల్లడించారు. తన కుడి కాలును చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న చర్మ సంబంధిత సమస్య కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందని తెలిపారు.తనకు డయాబెటిస్ ఎక్కువగా ఉండటం, ప్రారంభ దశలో ఆ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ మరింత తీవ్రతరం అయిందని ఆయన వివరించారు.