సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేసీఆర్ ఫామ్ హౌస్ వద్ద డప్పుల మోతకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలి వచ్చి డప్పులు మోగిస్తూ నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. వరదరాజపూర మీదుగా కేసీఆర్ ఫామ్ హౌస్ సమీపంలోకి కాంగ్రెస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని కేసీఆర్ ఫామ్ హౌస్ కు అర కిలోమీటరు దగ్గర్లోకి వెళ్లి డప్పుల మోతతో నిరసన తెలిపారు.