ఏపీలో వైద్య సేవల్ని ప్రజలకు చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా రాష్ట్రంలో 913 ఆశా వర్కర్ల పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రకటించారు. ప్రస్తుతం భర్తీ చేస్తున్న 913 ఆశా వర్కర్ల పోస్టుల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులు, సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళల్లో పదో తరగతి కనీస అర్హత కలిగి, 25-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం ఇస్తారు.