ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వెంకటాచలంలో ఉన్న ప్రముఖ సేవా సంస్థ ‘స్వర్ణభారత్ ట్రస్ట్’ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన విచ్చేశారు. అక్కడ ఉచిత నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీయువకులతో యోగి ఆదిత్యానాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. గ్రామీణ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఆరోగ్య సేవలు అందిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ కృషిని, అక్షర విద్యాలయం సేవలను యోగి కొనియాడారు.