తనపై ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ కంటతడి పెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతున్న సమయంలో సభాపతి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. స్పీకర్‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ మీ తల్లిని అవమానించడం బాధాకరమని, మీరు ఉన్నతస్థాయికి వెళ్లినందుకు మీ అమ్మను అవమానించాలా? అని అడిగారు. అట్టడుగు వర్గాల బిడ్డలమనేనా మనకు ఇంత అవమానమని భావోద్వేగానికి గురయ్యారు. తాతా మధు వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ బాధ్యత వహించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.