ఏపీలో నిర్వహించిన డీఎస్సీ 2025లో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైసీపీ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ డీఎస్సీలో అడ్డంగా టీచర్ పోస్టులు అమ్ముకున్నారని ఆరోపించారు. డీఎస్సీలో సెలక్ట అయిన వాళ్లంతా అడ్డదారుల్లో వచ్చిన వాళ్లు కాదని, ఉద్యోగం రాని వారికి అంతా అండగా ఉండాలని, భవిష్యత్తులో ఇలాంటివి జరగవనే భరోసా కల్పించాలని ప్రభుత్వానికి సూచించారు.