BRSకి చెందిన ఎస్సీ, ఎస్టీ శాసనసభ్యులపై పోలీసులు దౌర్జన్యానికి దిగడంపై ఆ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్‌కు బీఆర్ఎస్ ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులను అసెంబ్లీ ప్రాంగణం వెలుపల గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారని ఎమ్మెల్యేలు లేఖలో పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాల్సిన పోలీసు అధికారులు అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా.. అసభ్య పదజాలంతో దూషిస్తూ శారీరకంగా దాడులకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.