ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న స్థానిక ఎన్నికల్లో కేంద్ర బలగాలను మోహరించాలని YSRCP రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘంకు వైసీపీ వినతిపత్రం సమర్పించింది. గత స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న అక్రమాలు, అవకతవకలను ప్రస్తావిస్తూ వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఎస్ఈసీకి (SEC) ఫిర్యాదు చేశారు. స్థానిక ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా కేంద్ర బలగాలను మోహరించాలని ఆయన ఎన్నికల కమిషన్ ను కోరారు. వైసీపీ వినతిపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సానుకూలంగా స్పందించారు.