తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జపాన్లో సంతానోత్పత్తి రేటు ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో జనాభా తగ్గుదల సమస్యపై ప్రముఖ రచయిత్రి వినూత్నంగా స్పందించారు. ఏడో బిడ్డకు తాను జన్మనిచ్చినట్లు ప్రకటించి మాజీ రాజకీయ నేత కొటోయ్ హషిమోటో సోషల్ మీడియాలో వైరల్గా మారారు. పసికందు ఫోటోను షేర్ చేసిన ఆమె.. దేశంలోని ఇతర మహిళలు కూడా ఎక్కువ మంది పిల్లలను కనే విషయం గురించి ఆలోచించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.