విజయవాడ మేయర్ స్థానం కోసం నెలకున్న పోటీపై కేశినేని చిన్ని స్పందించారు. మేయర్ సీటు కోసం తమ పార్టీలో 15 మందికి పైగా పోటీ పడుతున్నారని ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే బోండా ఉమా కుమారుడికి మేయర్ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. మేయర్ సీటులో ఎవరిని పోటీ చేయించాలి అనేది సీఎం ఫైనల్ చేస్తారని కేశినేని తెలిపారు. అదే సమయంలో విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలు వాయిదా వేయాలని తాను సీఎంను కోరానన్నది అవాస్తవమని కేశినేని చిన్ని తేల్చిచెప్పేశారు.