జానపద నృత్యకారిణి, సోషల్ మీడియా స్టార్ మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన తోటి డాన్సర్ ఈశ్వర్ సాయిపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోవట్లేదనే కారణంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. అదృష్టవశాత్తూ కుటుంబ సభ్యులు సకాలంలో స్పందించడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది కేసు పెట్టి అయిదు రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇప్పటివరకూ ఈశ్వర్ సాయిపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదనే మనస్తాపంతో తాజాగా మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం చేశారు.