బస్టాండ్‌లో శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది. రెండేళ్ల క్రితమే భర్త చనిపోవడంతో, తన ఇద్దరు పిల్లలతో కలిసి నర్సమ్మ జీవిస్తోంది. అయితే తాజాగా ఆదోని ఆర్టీసీ బస్టాండ్‌లో నర్సమ్మ శానిటేషన్ విధులు నిర్వహిస్తుండగా అక్కడకి వచ్చిన ఇద్దరు మహిళలు నర్సమ్మ కళ్లలో కారం కొట్టి.. ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నర్సమ్మను స్థానికంగా ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు.