టాటా మోటార్స్ కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) రాబోయే రెండేళ్లలో బ్రిటన్లో దాదాపు 4 వేల ఉద్యోగాలకు కోత విధించనున్నట్లు ‘ది టైమ్స్’ కథనం పేర్కొంది.అమెరికా టారిఫ్ లు, వాహన తయారీ ఖర్చులు పెరగడం, విక్రయాలు తగ్గడమే ఇందుకు కారణమని తెలిపింది.మరోవైపు, ఉద్యోగాల కోతకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి సమాచారం అందజేశామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు కంపెనీ పేర్కొన్నట్లు సదరు వార్తా కథనం తెలిపింది.