ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2026’ అందాల పోటీల వేదిక మార్పు వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు ఆతిథ్యం ఇచ్చే దిశగా అడుగులు వేసిన భారత్‌కు నిర్వాహకులు ఊహించని షాక్ ఇచ్చారు. పోటీల్లో పాల్గొనే మోడళ్ల రక్షణ, వారికి కల్పించాల్సిన ఫైవ్ స్టార్ ఆతిథ్యం, ప్రొడక్షన్ ప్రమాణాల విషయంలో చేసుకున్న ఒప్పందాలను భారత్ పాటించడంలో విఫలమైంది. అందుకే భారత్ నుంచి ఈ ఈవెంట్ మొత్తాన్ని థాయిలాండ్‌కు మారుస్తున్నట్లు స్పష్టం చేశారు.