కొత్త ప్రపంచ పటం కోసం యూఎన్ అసెంబ్లీలో తీర్మానం చేశారు. అయితే ఆ కొత్త మ్యాప్‌లో ఆఫ్రికా ఖండం సైజు పెరగనున్నది. మెర్కేటర్ మ్యాప్‌లో వాస్తవాని కన్నా ఎక్కువ సైజులో కొన్ని ఖండాలు, దేశాలు ఉన్నాయి. ఈక్వేటార్కు దూరంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్.. మెర్కేటర్ మ్యాప్‌లో ఆఫ్రికా కన్నా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి గ్రీన్‌ల్యాండ్ కన్నా ఆఫ్రికా 14 రెట్లు పెద్దది. తీర్మానానికి యురోపియన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. మ్యాప్‌లు మారినా బోర్డర్లు మారవని ఈయూ పేర్కొన్నది.